తూర్పుగోదావరి జిల్లాతో పాటు విశాఖ జిల్లా శివారు ప్రాంతాల ప్రజలకు సేవలందించే కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని జిల్లా కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా. వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కొద్దిరోజుల్లో ఆసుపత్రిలో ఉన్న రోగులను డిశ్చార్జ్ చేసి ఆసుపత్రిలోని 1800 పడకలను కరోనా రోగులకు కేటాయించేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో జీజీహెచ్‌లోని 40 విభాగాల్లో అందుతున్న సేవలు స్తంభించనున్నాయి. ఆరోగ్య శ్రీ వర్తించే అన్ని సేవల కోసం ఇకపై గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో పొందొచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలోనే కాకినాడ జీజీహెచ్‌ను జిల్లా కొవిడ్ ఆసుపత్రిగా మార్చినట్లు వివరించారు.
కొవిడ్ ఆసుపత్రిగా కాకినాడ జీజీహెచ్ ... ప్రభుత్వ ఉత్తర్వులు జారీ - తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ వైద్యశాల వార్తలు
కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని జిల్లా కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు.
కోవిడ్ ఆసుపత్రిగా కాకినాడ జీజీహెచ్ ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ