తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎప్పటిలాగే సాధారణ వైద్య సేవలు కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. జిీజీహెచ్ను పూర్తి కొవిడ్ ఆసుపత్రిగా మార్చడం తగదని ఆయన అన్నారు. ప్రతిరోజు సాధారణ , అత్యవసర వైద్య సేవల నిమిత్తం సుమారు 2 వేల నంచి 3 వేల మంది రోగులు వస్తుంటారని ఆయన అన్నారు. జిీజీహెచ్ను పూర్తి కొవిడ్ ఆసుపత్రిగా మార్చి... ఓపీ సేవలు నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
'ఆ ఆసుపత్రిలో సాధారణ వైద్యసేవలు కొనసాగించండి' - కాకినాడ గవర్నమెంట్ జనరల్ హస్పిటల్ వార్తలు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎప్పటిలాగే సాధారణ వైద్య సేవలు కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు.
మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు