ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడ జంటహత్యల కేసును ఛేదించిన పోలీసులు - కాకినాడ జంటహత్యల కేసును ఛేదించిన పోలీసులు

మూడు నెలల క్రితం కాకినాడలో  సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్​ చేసి  4లక్షల 75వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం  చేసుకున్నారు.

కాకినాడ జంటహత్యల కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Oct 7, 2019, 4:06 PM IST

కాకినాడ జంటహత్యల కేసును ఛేదించిన పోలీసులు

కాకినాడలో జూన్​ 7న జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపిన వివరాల ప్రకారం...సూర్యారావుపేటలోని భార్యాభర్తలను హత్య చేసిన నిందితుడు వీర్రాజు గతంలో రెండేళ్ల పాటు అదే ఇంట్లో అద్దెకు ఉన్నాడని... స్టాక్‌ మార్కెట్​లో నష్టాలు రావటంతో చోరీకి వెళ్లి ఈ హత్యలు చేశాడన్నారు. ఆధారాలు లభించకుండా ఉండేందుకు పలు డాక్యుమెంట్లు తగులబెట్టాడని చెప్పారు. నిందితుడు చేసిన మూడు సెకండ్ల కాల్‌ ఆధారంగా కేసును ఛేదించినట్లు ఎస్పీ తెలిపారు. అతని దగ్గరనుంచి 4 లక్షల 75వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details