ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SOLAR PROJECT: సౌర విద్యుత్​ వైపు.. కాకినాడ కార్పొరేషన్​ చూపు

కాకినాడ నగరపాలక సంస్థ విద్యుత్​ భారం తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సంస్థపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా రెస్కో మోడల్​లో సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థకు సన్నాహాలు చేస్తోంది.

సౌరవిద్యుత్
సౌరవిద్యుత్

By

Published : Aug 27, 2021, 8:00 AM IST

కాకినాడ నగరపాలక సంస్థ విద్యుత్​ భారం తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే వేట కోట్ల రూపాయల విద్యుత్ భారం మోస్తున్న ఈ సంస్థ.. సౌర విద్యుత్ ఫలకలను ఏర్పాటు ద్వారా ఉపశమనం పొందేలా కార్యాచరణ రచిస్తోంది. కాకినాడ నగరపాలక సంస్థపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా రెస్కో మోడల్​లో సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థకు సన్నాహాలు చేస్తుంది.

ప్రస్తుతం 16 వేల వీధి దీపాల తోపాటు కార్పొరేషన్ కార్యాలయాలకు నీటి పథకాలు ప్రతి నెల రూ.56 లక్షల వరకు విద్యుత్​కు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే కాకినాడ నగరంలోని వివేకానంద పార్క్​లో సోలార్ ఫలకలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన నగరపాలక సంస్థ.. ఇక్కడ విద్యుత్ పార్కులోని విద్యుద్దీపాలతో పాటు ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు చర్యలు చేపడుతోంది. నగరంలోని గాంధీ పార్క్ ఇతర ఆహ్లాదకర ఉద్యానవనాల్లో విద్యుత్ అవసరాలను సౌర పలకల ద్వారా తీర్చాలనే నిర్ణయానికి వచ్చింది.
వివేకానంద పార్క్​ మధ్యలోనే చెరువు గట్టుపై 20 కిలోవాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు ప్రతిపాదన ఉంది. విక్టోరియా వాటర్​ వర్క్స్​ లోని నీటి పథకం దగ్గర సౌర ఫలకలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అమ్మను ఘాటి పార్కులను నగర అవసరాలకు అత్యధిక సామర్థ్యంతో తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. సార్ విద్యుత్ అందుబాటులోకి వస్తే ఆర్థిక భారం తగ్గుతుందని.. కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:FIRE: విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మంటలు.. సరఫరా నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details