పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. ప్రతి మూడో శనివారం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులే.. శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చెత్తను తొలగించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులతో కలసి చీపురు పట్టుకుని కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. జాయింట్ కలెక్టర్ సత్తిబాబు, డీఆర్వో గోవిందరాజులు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'చీపురు పట్టిన తూ.గో జిల్లా కలెక్టర్' - green
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చీపురు పట్టారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అనుకోకుండా మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిరూపించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో సిబ్బందితో కలిసి చీపురుకు పని చెప్పారు.
'చీపురు పట్టిన తూ.గో జిల్లా కలెక్టర్'