ఎమ్మెల్యే వనమాడి ఎన్నికల ప్రచారం కాకినాడ నగర నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెదేపా పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారన్నారు వనమాడి. ప్రభుత్వంచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనకు మరోసారి విజయం చేకూరుస్తాయని ఆయన చెబుతున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులందరికీ సంక్షేమం అందించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పై గతంలో ఎన్నడూలేని అభిమానం ప్రజలు చూపిస్తున్నారని చెప్పారు.