తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ రహదారులు అన్నీ గోతులమయం అయ్యాయి. నగరానికి నాలుగు దిక్కుల నుంచి వచ్చే అన్ని ప్రధాన మార్గాలు ధ్వంసమైనా మరమ్మతులకు నోచుకోకపోవడంతో స్థానికులకు నిత్యనరకంగా మారాయి.
కాకినాడ రహదారులు గోతులమయం... నిత్యనరకంగా ప్రయాణం
కాకినాడకు రోజూ కొన్ని వేల వాహనాలు వివిధ జిల్లాల నలుమూలల నుంచి వస్తుంటాయి. దాంతో రహదారులన్నీ గుంతలు పడ్డాయి. అవి మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల స్థానికులకు నిత్యనరకంగా మారాయి. వాహనాలు కూడా పాడవుతుండటంతో అదనపు భారం తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కాకినాడ రహదారులు గోతులమయం
కాకినాడ నుంచి రామచంద్రాపురం, కత్తిపూడి, యానాం, రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారులు గుంతలుపడటంతో చోదకులు ఆందోళన చెందుతున్నారు. వాహనాలు పాడవుతుండటంతో అదనపు భారం తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారుల మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:యానాంలో కార్తిక స్నానాలకు ఏర్పాట్లు