తూర్పుగోదావరి జిల్లా... రాజమహేంద్రవరం సమీపంలోని కడియం వద్దకు చేరుకోగానే.. తాజా పూల పరిమళం గుబాళిస్తుంది. రోడ్డుకు ఎటువైపు చూసినా.. పచ్చని మొక్కలు, రంగురంగుల పుష్పాలతో నిండిన నర్సరీలు దర్శనమిస్తాయి. ఇప్పుడు ఈ నర్సరీలు... క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం మరింత అందంగా తయారవుతున్నాయి.
దేశవిదేశీ జాతుల పుష్పాలతో నిండిపోయాయి. పండగల్ని దృష్టిలో పెట్టుకుని... వర్బినా, నికోటినా, ప్లాక్స్, డయాంతస్తో, ఫెటోనియా లాంటి అనేక మొక్కలను... నిర్వాహకులు పెంచుతున్నారు. బహుమతులుగా ఇచ్చేందుకు, ఇళ్లలో అలంకరించుకునేందుకు... ఈ రకం మొక్కలు బాగుంటాయని అంటున్నారు సందర్శకులు.