ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒడ్డుకు 800 అడుగుల దూరంలో బోటు... శ్రమిస్తోన్న ధర్మాడి బృందం - ధర్మాడి సత్యం వార్తలు

గోదావరిలో కచ్చులూరు వద్ద మునిగిన బోటు వెలికితీతకు శుక్రవారం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బోటు జాడతెలిసినా ఒడ్డుకు తెచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం శ్రమిస్తోంది. లంగరుకు బోటు చిక్కుతున్నా పట్టు వదులుతోంది. బోటు సుమారు 75 అడుగులు ముందుకు కదిలిందని ధర్మాడి బృందం వెల్లడించింది.

ఒడ్డుకు 800 దూరంలో బోటు... శ్రమిస్తోన్న ధర్మాడి బృందం

By

Published : Oct 18, 2019, 11:09 PM IST

Updated : Oct 19, 2019, 10:58 AM IST

ఒడ్డుకు 800 అడుగుల దూరంలో బోటు... శ్రమిస్తోన్న ధర్మాడి బృందం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన పర్యాటకబోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వెలికితీత పనులు కొనసాగించింది. 3 వేల మీటర్ల ఇనుప రోపు సాయంతో భారీ లంగరును నదిలోకి వదలటంతో అది బోటుకు పట్టుకుంటోంది. అయినా బోటు మాత్రం ఒడ్డుకు చేర్చేందుకు సత్యం బృందం శ్రమిస్తోంది. శుక్రవారం ఉదయం వేసిన లంగరుకు చిక్కినట్టే చిక్కి పట్టువదిలింది. కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షణలో మరోసారి సాయంత్రం నదిలోకి లంగరును వదిలారు. అన్నివైపుల నుంచి బోటుకు ఉచ్చు వేశారు. తర్వాత ప్రొక్లెయిన్‌తో ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారు. ఈసారి తప్పనిసరిగా బోటు వస్తుందని భావిస్తున్న సమయంలో మళ్లీ పట్టు వదిలేసింది. అయితే ఇవాళ 75 అడుగుల ముందుకు కదిలిందని, ఒడ్డుకు 800 అడుగుల దూరంలో 40 అడుగుల లోతులో బోటు ఉందని ధర్మాడి సత్యం తెలిపారు. వెలికితీత ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం గోదావరి తీరంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో రెస్క్యూ ఆపరేషన్‌ నిలిచిపోయాయి. శనివారం ఉదయం నుంచే మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని సత్యం చెప్పారు.

ఇదీ చదవండి :

Last Updated : Oct 19, 2019, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details