తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సాగర సంగమం వద్ద వశిష్టా నదిలో స్థానిక మత్స్యకారుల వలలో 28 కిలోల మగ కచ్చిడి చేప చిక్కింది. దీన్నిఆదివారం స్థానిక ఫిషింగ్ హార్బర్లో వేలం వేయగా రూ.2.60 లక్షలకు స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు. అరుదుగా చిక్కే ఈ చేపలను చైనాకు ఎగుమతి చేస్తామని వ్యాపారి తెలిపారు. మగ చేప మాత్రమే అంత విలువ ఉంటుందని, ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని, మత్స్యశాఖ జేడీ పీవీ సత్యనారాయణ తెలిపారు.
వలకు చిక్కిన 28 కేజీల చేప.. ధర తెలిస్తే షాకే!
అంతర్వేదిలో మత్స్యకారుల వలకు 28 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దాన్ని వేలం వేయగా.. ఓ వ్యాపారి రూ.2.60 లక్షలకు కొనుగోలు చేశాడు. దానిని చైనాకు ఎగుమతి చేస్తామని వ్యాపారి చెప్పాడు.
kachidi fish cought in antarvedhi east godavari district