ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుంగిన వంతెన...మాజీ ఎమ్మెల్యే పరిశీలన - ఏలేశ్వరం వార్తలు

భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా ఏలేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నదిపై తూర్పుగోదావరి జిల్లా అప్పన్నపాలెం వద్ద నిర్మించిన కాజ్ వే వంతెన కుంగిపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వంతెనను మాజీ ఎమ్మెల్యే జ్యోతుల పరిశీలించారు.

Jyotula Nehru inspected the Cause way Bridge in Appanna Palem,
కుంగిపోయిన వంతెనను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

By

Published : Sep 16, 2020, 3:53 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్న పాలెంలో ఏలేరు నీటి ఉద్ధృతికి దెబ్బతిన్న కాజ్ వే వంతెనను మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలను అనుసంధానం చేసే ఈ వంతెన కుంగిపోవడంతో మర్రిపాక, ఇర్రిపాక, మామిడాడ, నరేంద్రపట్నం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జ్యోతుల, తెలుగు యువత ఉపాధ్యక్షులు పైలా బోస్ కలసి పరిశీలించారు. నీటి ఉద్ధృతి తగ్గిన వెంటనే వంతెన మరమ్మతు పనులను చేపట్టాలని నెహ్రూ డిమాండ్ చేసారు.

ABOUT THE AUTHOR

...view details