ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్ విగ్రహంపై ఉన్న తపన పోలవరంపై లేదు: జ్యోతుల నెహ్రూ - ys statue at polavaram project news

పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు విమర్శించారు. పోలవరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం, ఉద్యానవనం ఏర్పాటుపైనే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తపన అంతా ఉందని దుయ్యబట్టారు.

Jyothula Nehru
Jyothula Nehru

By

Published : Nov 20, 2020, 3:30 PM IST

వైకాపా ప్రభుత్వం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టును భ్రష్టు పట్టించాయని దుయ్యబట్టారు. నీటిపారుదల శాఖ మంత్రికి అవగాహన లేకపోవటంతో ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని తెదేపా కార్యాలయంలో జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు.

వైకాపా అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టులో ఒక్క శాతం పనులు కూడా జరగలేదు. ప్రాజెక్టు ఎత్తును సైతం ప్రభుత్వం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. పోలవరంలో 125 అడుగుల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం, చుట్టూ ఉద్యానవనం ఏర్పాటుపైనే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తపన ఉంది. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆసక్తి మంత్రిలో కనిపించడం లేదు. పోలవరం నిర్వాసితులకు 33 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు- జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details