ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి- జ్యోతుల నవీన్ - తూర్పు గోదావరిలో రైతుల కష్టాలు

వరదల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా కాకినాడ పార్లమెంట్ కో- ఆర్డినేటర్ జ్యోతుల నవీన్ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో వేల ఎకరాలు వరద నీటిలో మునిగాయన్నారు.

jyothula naveen demands to help farmers effected with floods
జ్యోతుల నవీన్

By

Published : Oct 17, 2020, 7:44 PM IST

వరదల నియంత్రణ, బాధితుల్ని ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా కాకినాడ పార్లమెంట్ కో- ఆర్డినేటర్ జ్యోతుల నవీన్ విమర్శించారు. వరద బాధితుల్ని పరామర్శించే తీరిక కూడా సీఎం జగన్ కు లేదా అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో వరి చేలతో సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం తక్షణం రైతుల్ని ఆదుకోవాలని జ్యోతుల నవీన్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details