పేదలకు ఇళ్లు ఇవ్వడాన్ని తెలుగుదేశం స్వాగతిస్తుందని... కానీ సెంటు భూమిలో ఇంటి నిర్మాణం దారుణమని తెదేపా నేత జ్యోతుల నవీన్ వ్యాఖ్యానించారు. ఉప్పాడ తీరంలో సముద్రం ముందుకు వస్తోందని తెలిసి కూడా అక్కడ స్థలాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని బట్టి పేదల ప్రాణాలకు ప్రభుత్వం ఎంత విలువ ఇస్తుందో అర్థమవుతోందని అన్నారు. కాకినాడకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇంద్రపాలెం, గురజనాపల్లి గ్రామాల్లో 40 లక్షల రూపాయలకు ఎకరం భూమి ఉన్నా...కొలుగోలు చేయలేదని విమర్శించారు . భూముల కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నవీన్ ఆరోపించారు. తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలు లబ్దిదారులకు ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు.
'పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో లోపాలు'
సెంటు భూమిలో ఇంటి నిర్మాణం దారుణమని తెదేపా నేత జ్యోతుల నవీన్ అన్నారు. భూముల కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలు లబ్దిదారులకు ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు.
పేదల ఇళ్ల స్థలాల పంపీణీలో లోపాల పై జ్యోతుల నవీన్ ధ్వజం
ఇదీ చదవండీ...