కాకినాడ తెదేపా లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన జ్యోతుల నవీన్.. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో తెదేపా ఇంఛార్జ్ వరుపుల రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నవీన్ స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌పై విమర్శలు గుప్పించారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చ లేని నెహ్రూను విమర్శించే స్థాయి ప్రసాద్‌కు లేదన్నారు. వారందరూ సహకరిస్తేనే ఎన్నికల్లో గెలిచాననే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.