ప్రజాధనంతో 60 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది కానీ పేద ప్రజలకు ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని జ్యోతుల నవీన్ ప్రశ్నించారు. సేకరించిన 60 వేల ఎకరాల్లో 58 వేల ఎకరాలకు.. ఎటువంటి ఆటంకాలు లేవని.. ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని ప్రభుత్వాని అడిగారు. వైకాపా ప్రభుత్వం తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిరసన కార్యక్రమం సామాన్య ప్రజల తరఫున చేపట్టామని నవీన్ స్పష్టం చేశారు. లబ్ధిదారులకు తక్షణమే టిడ్కో ఇళ్లను ఇవ్వాలని లేనిపక్షంలో లబ్ధిదారులను తీసుకెళ్లి గృహప్రవేశం చేసే విధంగా తెలుగుదేశం బాధ్యత తీసుకుంటుందన్నారు.
ఇళ్ల స్థలాలు ఇస్తామన్న మాట ఏమైంది?: జ్యోతుల నవీన్ - పేదలకు ఇళ్ల స్థలాలపై జ్యోతుల నవీన్ కామెంట్స్
పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నా ఎందుకు ఇవ్వలేదని తెదేపా నేత జ్యోతుల నవీన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రకటన ఆచరణ నోచుకోలేదన్నారు.

ఇళ్ల స్థలాలు ఇస్తామన్న మాట ఏమైంది?: జ్యోతుల నవీన్