తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్ ఎదుట జూనియర్ డాక్టర్లు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కోవిడ్ విధులకు హాజరైన జుడాలు.. ఓపీ గేటు ఎదురుగా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు డా.భాస్కర్, ఉపాధ్యక్షులు కళాసాగర్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
కరోనా విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లకు 50 లక్షల బీమా కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు. నాణ్యమైనీ పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందించాలని కోరారు. విధులు నిర్వహిస్తున్న వైద్యులపై కొందరు దాడులు నిర్వహిస్తున్నారని.. ఇలాంటి ప్రమాదకర పరిణామాలను అరికట్టాలని స్పష్టం చేశారు.