తూర్పుగోదావరి జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట, గండేపల్లి మండలలాకు చెందిన తారక్ అభిమానులు... సత్తెమ్మతల్లి అమ్మవారి ఆలయం వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వలస కూలీలకు, లారీ డ్రైవర్లకు, పాదచారులకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. తమ అభిమాన హీరో జన్మదినం సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలనే ఉద్దేశంతో పేదలకు ఆహారాన్ని అందజేశామని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు వివరించారు.
ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు - jr ntr birthday celebrations in east godavari
తూర్పుగోదావరి జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆహారాన్ని పంచిపెట్టారు. ఏదైనా మంచి పని చేయాలనే ఉద్దేశంతో తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా అన్నార్తులకు భోజనాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు