జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో స్థానిక విలేకరులు నిరసన చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా కాకినాడలో జరుగుతున్న మత్తు పదార్థాల అక్రమ వ్యాపారాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఓ జర్నలిస్టుపై.. ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇటువంటి దాడులు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో రజనీ కుమారికి వినతి పత్రం సమర్పించారు.
Journalists protest: విలేకరుల నిరసన.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ - protest in prathipadu
తూర్పుగోదావరి జిల్లాలో విలేకరులు ఆందోళన నిర్వహించారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఎమ్మెల్యే ద్వారంపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రత్తిపాడులో విలేకరుల నిరసన
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి వార్తలను అందిస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని విలేకరులు అన్నారు. మత్తు పదార్థాల వ్యాపారంపై వార్తలు సేకరించిన జర్నలిస్టుపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇదీచదవండి.