తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఖాళీగా ఉన్న వ్రత పురోహితుల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య, ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఎంపిక చేపట్టారు.
అన్నవరం దేవస్థానంలో ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ఖాళీల భర్తీ - ఈటీవీ భారత్ తాజా వార్తలు
అన్నవరం దేవస్థానంలో ఖాళీగా ఉన్న వ్రత పురోహితుల పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించారు. పలు పరిణామాలు, ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక బృందం సమక్షంలో భర్తీ చేపట్టారు. ప్రక్రియ అంతా వీడియో రికార్డింగ్ చేసి, ఖాళీలను అనుగుణంగా 39 మంది పురోహితులను ఎంపిక చేశారు.
39 ఖాళీలకు గాను 58 మంది పరీక్షకు హాజరయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఆర్జేసి ఆజాద్, రాజమహేంద్రవరం ఆర్జేసి భ్రమరాంబ, దేవస్థానం ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో... పండితులు, అర్చకులు, పురోహితుల బృందం ఆధ్వర్యంలో, కమిటీ నియామక ప్రక్రియ చేపట్టింది. అభ్యర్థులకు రాత, మౌఖిక పరీక్షల ద్వారా మంత్రాలు పఠించడంలో బాగా ప్రావీణ్యం ఉండటం, వ్రతాలు చేయించడానికి శారీరకంగా దృఢత్వం, అర్హతలు అన్నింటినీ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించారు. ప్రక్రియ అంతా వీడియో రికార్డింగ్ చేసి, ఖాళీలను అనుగుణంగా 39 మంది పురోహితులను ఎంపిక చేశారు.
ఇవీ చూడండి:సున్నా వడ్డీకి ఏదీ అండ?.. వాణిజ్య బ్యాంకుల మోకాలడ్డు