జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా వికాస ఆఫీస్లో జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ ముఖాముఖికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో యువతి, యువకులు తరలివచ్చారు. సుమారు ఐదు కంపెనీలలో 150 ఖాళీలను భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించామని ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. అభ్యర్థులందరు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ముఖాముఖికి హాజరయ్యారన్నారు.
వికాస కార్యాలయంలో జాబ్ మేళా - job mela news in east godavari
తూర్పుగోదావరి జిల్లాలోని నిరుద్యోగులకు వికాస కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువతి, యువకులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ముఖాముఖిలో పాల్గొన్నారు.
వికాస కార్యాలయంలో జాబ్ మేళా