ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనుమదారులను పరిశీలించిన జేఈవో సదా భార్గవి - JEO Sada Bhargavi visits Thirumala kanuma root

తిరుమల కనుమదారుల్లో జరుగుతున్న పనులను జేఈవో సదా భార్గవి పరిశీలించారు. తితిదే.. భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా, వివిధ పూల మొక్కలను పెంచుతుండగా.. నేడు ఈ పనులను ఆమె పర్యవేక్షించారు.

JEO Sada Bhargavi
తిరుమల కనుమదారులను పర్యవేక్షించిన జేఈవో సదా భార్గవి

By

Published : Mar 19, 2021, 8:05 PM IST

తిరుమల కనుమదారుల్లో జరుగుతున్న పనులను జేఈవో సదా భార్గవి పరిశీలించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా వివిధ పూల మొక్కలను పెంచేందుకు తితిదే చర్యలు చేపట్టింది. కొండ చరియలు, రాతి బండలు కనిపించకుండా ఉండేలా అనేక రకాల పూల మొక్కలు వేలాడదీసి పెంచే విధానాన్ని అక్కడి వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట భూమి చదును చేసి తగిన పూల మొక్కలు పెంచాలని అధికారులను ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని వివరించారు. అలిపిరి టోల్ గేట్ నుంచి వినాయక స్వామి గుడి వరకు ప్రత్యేక డిజైన్​లతో.. మొక్కల పెంపకం గురించి అధికారులతో చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details