రాష్ట్రంలో కౌలు రైతుల స్థితిగతులను తెలుసుకునేందుకు తను కూడా మెట్ట ప్రాంతంలో కౌలుకు వ్యవసాయం చేస్తున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తెలిపారు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని అరుణాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ధర్మవరం గ్రామానికి చెందిన చెక్కపల్లి సత్తిబాబు అనే రైతు వద్ద పది ఎకరాలు భూమిని కౌలుకు తీసుకొని ఏరువాక సాగారు. మాజీమంత్రి ముద్రగడను కిర్లంపూడిలో అయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
వాళ్ల కష్టాలు తెలుసుకునేందుకే..కౌలు రైతయ్యా..! - జేడీ లక్ష్మి నారాయణ కౌలు వ్యవసాయం తాజా వార్తలు
కౌలు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు .. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కౌలుకు భూమికి తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ధర్మవరం గ్రామంలో ఓ రైతు వద్ద ఆయన భూమిని కౌలుకు తీసుకున్నాడు.
ట్రాక్టర్ నడుపుతున్న జేడీా