తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలంలో ముడురుమిల్లి ఆశ్రమ పాఠశాలను జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి సందర్శించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. అలాగే విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లు, స్నానపు గదులను పరిశీలించారు. రంపచోడవరం గ్రామ సచివాలయంలో ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలుపై ఉద్యోగులను ఆరా తీశారు. జేసీ వెంట డీపీవో నాయక్, ఏటీడబ్ల్యూఓ సుజాత, ఏఈ సత్యనారాయణ, హెచ్ఎం రాజబాబు, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
నాడు-నేడుతో పాఠశాల అభివృద్ధి: జేసీ కీర్తి చేకూరి - east godavari district
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాల ఎంతో అభివృద్ధి చెందుతాయని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు.
నాడు-నేడుతో పాఠశాల అభివృద్ధి:జేసీ కీర్తి చేకూరి