ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొరాయించిన కెనాల్ గేటు.. స్థానికుల ఆందోళన - floods to godavari

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద... నీటిని విడుదల చేసే జి.సి మెయిన్ కెనాల్ గేట్ మొరాయించింది. ఒక్కసారిగా లొల్ల లాకుల కాలువకు నీటి ప్రవాహం పెరింది. ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

atreyapuram east godavari district
atreyapuram east godavari district

By

Published : Aug 22, 2020, 4:04 PM IST

తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద కాలువకు నీటిని విడుదల చేసే జీసీ మెయిన్ కెనాల్​లోని ఓ గేటు మొరాయించింది. లొల్లలాకుల కాలువకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా పరిసర ప్రాంతాలతో పాటు పొలాలు నీట మునిగాయి.

అప్రమత్తమైన స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు మూడు గేట్లను తనిఖీ చేశారు. ఎలాంటి ప్రమాదం లేదని.. కొద్దిపాటి ప్రవాహం పెరగవచ్చని అంచనా వేశారు. మొరాయించిన గేటుకు మరమ్మతు చేశారు.

ABOUT THE AUTHOR

...view details