కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెదేపా, జనసేన నాయకులు మండిపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ద్వారంపూడి క్షమాపణ చెప్పాలని కాకినాడలో తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. గుంటూరులో జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు అహంకార పూరితంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలపై భగ్గుమన్న తెదేపా, జనసేన - tdp janasena fire on dwarampudi chandrashekar reddy comments
తెదేపా అధినేత చంద్రబాబుపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు సైతం ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా అనుచితంగా మాట్లాడడం సరికాదని అన్నారు.
ద్వారంపుడి చేసిన ఆ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెదేపా జనసేన