ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి.. ప్రజా సమస్యలు పరిష్కరించాలి' - కరెంటు బిల్లు వార్తలు

పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి, జన సైనికులతో కలిసి గొల్లప్రోలులో నిరసన దీక్ష చేపట్టారు. లాక్​డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైకాపా ఏడాది పాలన వైఫల్యాలను జనసేన ఎండ కడుతోందన్నారు.

east godavari district
జనసేన నిరసన దీక్షలు

By

Published : May 25, 2020, 4:47 PM IST

తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. లాక్​డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో జన సైనికులతో కలిసి నిరసన తెలిపారు. తక్షణమే విద్యుత్ బిల్లులు రద్దు చేసి పాత స్లాబ్ విధానాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, మట్టి, గ్రావెల్ తవ్వకాలు తరలింపు యథేచ్చగా నిర్వహిస్తూ అభివృద్ధి పనుల్లో జాప్యం ప్రదర్శిస్తున్నారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి కృషి చేస్తున్న వైద్యులను ప్రధాని మోదీ నుంచి అందరూ అభినందిస్తుంటే.. రాష్ట్రంలోని మాస్కులు లేవని చెప్పిన డాక్టర్ సుధాకర్​ని తాగుబోతుగా చిత్రీకరించి చిత్రహింసల పెట్టడం సరికాదన్నారు. వైకాపా ఏడాది పాలన వైఫల్యాలను జనసేన ఎండకడుతోందన్నారు.

ఇది చదవండిమడ భూములు కాదు.. పోర్టు భూములే ఇస్తాం: కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details