ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ సభలో జనసేన ఎమ్మెల్యే... రాజకీయ వర్గాల్లో చర్చ...! - jagan east godavari tour

సీఎం జగన్... తూర్పుగోదారవరి జిల్లా పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు... ముఖ్యమంత్రి హాజరైన బహిరంగ సభలో పాల్గొన్నారు.

జనసేన ఎమ్మెల్యే

By

Published : Nov 21, 2019, 7:31 PM IST

జగన్ సభలో జనసేన ఎమ్మెల్యే... రాజకీయ వర్గాల్లో చర్చ...!

ముఖ్యమంత్రి జగన్​మోహన్‌రెడ్డి హాజరైన సభకు... జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఆసక్తికర అంశంగా మారింది. ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో సీఎం బహిరంగ సభలో రాపాక పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాపాకను ఆప్యాయంగా పలకరించారు. కొంతకాలంగా వరప్రసాదరావు వైకాపాకు సన్నిహితంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే ఆ సభకు రావడంపై ఆసక్తి రేపుతోంది. కాగా... అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్​ను రాపాక వరప్రసాదరావు పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details