తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జనసేన మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీను కొనియాడారు. ఇటీవల ఆలమూరు దేవి కాలనీకి చెందిన దుర్గాప్రసాద్ కు రోడ్డుప్రమాదంలో వెన్నెముకకు గాయమై రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అతని కుటుంబ సభ్యుల వద్ద నగదు లేని పరిస్థితుల్లో.. గల్ఫ్ సేన మిత్ర బృందం స్పందించి రూ.40 వేల ఆర్థిక సాాయాన్ని అందించింది. దానికి సంబంధించిన చెక్కును బండారు శ్రీనివాస్ కుటుంబ సభ్యలకు అందించారు.
"జనసేన మిత్ర బృందం సేవలు అభినందనీయం" - east godavari district latest news
జనసేన మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొత్తపేట నియోజకవర్గం పార్టీ ఇంఛార్జి బండారు శ్రీను అన్నారు.
చెక్కును అందిస్తున్న జనసేన మిత్ర బృందం