తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. జిల్లాలోని భానుగుడి కూడలిలో ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు జనసేన నాయకులు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా ఎమ్మెల్యే ఇంటి పరిసరాల్లో భారీగా మోహరించారు.
వయసుకైనా గౌరవం ఇవ్వరా:పాముల రాజేశ్వరి
వయసుకైనా గౌరవం ఇవ్వకుండా... సమాజం తలదించుకునేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి అన్నారు. స్థానిక ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.