ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాపులకు కావాల్సింది లోన్లు కాదు.. రిజర్వేషన్లు: జనసేన - కాపు రిజర్వేషన్లపై మాట్లాడిన జనసేన నేత పంతం నానాజీ

కాపు వర్గానికి కావల్సింది లోన్లు కాదని.. రిజర్వేషన్ల అని జనసేన నేత పంతం నానాజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విలేకర్లతో మాట్లాడారు. గత తెదేపా ప్రభుత్వం, ప్రస్తుత వైకాపా ప్రభుత్వం రెండూ కాపులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

janasena leader pantham nanaji about kapu reservations
పంతం నానాజీ, జనసేన నేత

By

Published : Jun 28, 2020, 3:26 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి కాపులను అణచివేసే విధంగా వ్యవహరిస్తోందని.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జనసేన నాయకులు పంతం నానాజీ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. కాపులకు కావాల్సింది లోన్లు కాదని.. రిజర్వేషన్లు అని స్పష్టం చేశారు. తెదేపా హయాంలో కాపు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మాట తప్పితే.. నేడు జగన్ అదే బాటలో నడుస్తున్నారన్నారు.

2 లక్షల మందికి లోన్లు ఇచ్చి కాపులను ఉద్ధరించినట్లుగా వైకాపా నేతలు మాట్లాడడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. మంత్రి కన్నబాబుకి కాపు రిజర్వేషన్లపై అవగాహన లేదన్నారు. భాజపాతో కలిసి జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు పవన్ కల్యాణ్ మొదటి సంతకం కాపు రిజర్వేషన్లపైనే పెడతారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details