Pawan Kalyan Varahi Yatra: ఆంధ్రప్రదేశ్ కు వైసీపీ నుంచి విముక్తి కలిగించాలని .. అది జరగాలంటే ముందు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీని జీరో చేయాలి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లులో ఒక్క చోట కూడా వైసీపీ గెలవకూడదని అన్నారు. మలికిపురంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో నిర్వహించిన భహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన ఓట్లతో అసెంబ్లీకి వెళ్లి వైకాపా కు వెళ్లారన్న పవన్.. రాపాకలాంటి ఎమ్మెల్యేలను రీ కాల్ చేయాలన్నారు. రెండు వందల రూపాయలు లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుందని...5 వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసేవారు పాలిస్తున్నారని పవన్ మండిపడ్డారు. దొంగ ఓట్లు వేస్తారు, మన ఓట్లు తీసేస్తారన్న.. ఓటర్లు పవన్ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కులాల సర్దుబాటు కోసమే కుల ప్రస్తావన తెస్తున్నాను తప్ప రెచ్చగొట్టటానికి కాదని పవన్ చెప్పారు.
ఓటు చీలడం వల్ల ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్లు గెలుస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు. 70 శాతం ప్రజలు వ్యతిరేకించిన వాళ్లు పదవిలోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఓటుబ్యాంకు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదన్న పవన్ పేర్కొన్నాడు. మనమే జీఎస్టీ చెల్లించి ప్రభుత్వ ఖజానా నింపుతున్నామన్న పవన్.. 100 మంది దగ్గర పన్నులు తీసుకుని 40 మంది వైసీపీ వాళ్లకే లబ్ది చేస్తే ఎలా అన్న పవన్ ప్రభుత్వ ఖజానాలోని డబ్బును అందరికీ న్యాయంగా పంచాలని వెల్లడించాడు. సీఎం బటన్ నొక్కితే అందరికీ డబ్బులు పడుతున్నాయా అని ప్రశ్నించాడు. ప్రజలకు సరైన రోడ్లు వేయకుంటే ఎన్ని బటన్లు నొక్కితే ఏం లాభం అంటూ ఎద్దేవా చేశాడు.