ఈ నెల 16వ తేదీన జనసేన -భాజపా కీలక సమావేశం విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో పార్టీల సమిష్టి కార్యాచరణపై ఇరు పక్షాలు చర్చించనున్నాయి. ఇటీవల దిల్లీలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.... భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాజపా-జనసేన పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించాయి.
దిల్లీ పర్యటనలో ...
హస్తిన పర్యటనలో రాష్ట్ర రాజధాని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని పవన్ తెలిపారు. రాజధాని రైతుల ఆందోళనలు, రాజధాని తరలింపుపై చర్చించామన్నారు. ఏపీ రాజకీయ వ్యవహారాలను కేంద్రం నిశితంగా పరిశీస్తుందన్నారు. సరైన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పవన్ తెలిపారు.