కరోనా వ్యాప్తి కారణంగా దేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతోంది. రాష్ట్రంలో అనేకమంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుతో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన జనసైనికులు పేదలకు సాయం అందిస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు పంచిపెడుతున్నారు. కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పిస్తున్నారు.
పేదలకు నిత్యావసరాలు అందించిన జన సైనికులు - janasena latest news in east godavari
తూర్పుగోదావరి జ్లిలా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన జనసైనికులు నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నామన్నారు.

jana-sainikulu
పేదలకు నిత్యవసర సరుకులు అందిస్తున్న జన సైనికులు