తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో చిక్కుకుపోయిన మధ్యప్రదేశ్ వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు తహసీల్దారు ఏర్పాటు చేశారు. ముందుగా వారికి వైద్యపరీక్షలు చేశారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవటంతో 26మందిని పెద్దాపురం తరలించారు. అక్కడినుంచి విజయవాడ చేరుకుని ప్రత్యేక రైలులో మధ్యప్రదేశ్‌కు పంపించటం జరుగుతుందని కృష్ణమూర్తి తెలిపారు.
జగ్గంపేటలోని వలస కూలీలు స్వస్థలాలకు తరలింపు - జగ్గంపేటలో వలసకూలీల ఇబ్బందులు
లాక్ డౌన్ కారణంగా జగ్గంపేటలో మధ్యప్రదేశ్ వలస కూలీలు గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ వలస కూలీలను స్వస్థలాలకు తరలింపు