జగనన్న పచ్చతోరణం..మొక్కను నాటిన ఎంపీ - Jagannanna Pachatoranam
తొర్రేడులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే లే అవుట్ వద్ద జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ రామ్ హాజరయ్యారు. అనంతరం మొక్కను నాటారు.
తూర్పుగోదావరి జిల్లా తొర్రేడులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే లే అవుట్ వద్ద జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్ రామ్ మొక్కను నాటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలుగన్న హరితాంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే విధంగా సీఎం జగన్ జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఎంపీడీవో సుభాషిణిపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం సమన్వయకర్త ఆకుల వీర్రాజు, ఎంపీడీవో సుభాషిణి, ఏపీవో మణికుమారి తదితరులు పాల్గొన్నారు.