జగన్ వందరోజుల పాలన అంతా రివర్సేనని మాజీ హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. తమ నాయకుడు రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తే..జగన్ మాత్రం పాలనను తిరోగమన దిశగా నడిపిస్తున్నారన్నారు. అమరావతి నిర్మాణం, పోలవం ప్రాజెక్ట్‌లను అర్థాంతరంగా ఆపేయటం హేయమైన చర్యగా వ్యాఖ్యానించారు. ఇసుక పాలసీ అంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వందరోజుల్లో వైకాపా ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమన్నారు.
జగన్ పాలన అంతా రివర్సే: చినరాజప్ప - One Hundred
జగన్ వంద రోజుల పాలనపై మాజీ హోమంత్రి చినరాజప్ప విమర్శలు గుప్పించారు. జగన్ పాలన అంతా రివర్సేనని మండిపడ్డారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
చినరాజప్ప