ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిగా అమరావతి వద్దని జగన్ ముందే చెప్పారు: వైవీ సుబ్బారెడ్డి - రాజధాని అమరావతి

రాజధానిగా అమరావతిని ముందు నుంచే జగన్ వ్యతిరేకిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏడాదికి మూడు పంటలు పండే ప్రాంతంలో రాజధాని నిర్మాణం వద్దని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సూచించారని వెల్లడించారు.

yv subba reddy
వైవీ సుబ్బారెడ్డి

By

Published : Dec 22, 2019, 8:59 PM IST

ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాకముందు నుంచే అమరావతిని రాజధానిగా చేయొద్దని చెప్తున్నారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా లేదని చెప్పిందని గుర్తు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టిందని... అయినప్పటికీ సరైన రహదారులు, వీధి దీపాలు కూడా లేవన్నారు. గత ప్రభుత్వం చెప్పిన రీతిలో రాజధానిని నిర్మించాలంటే రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల భారంలో ఉన్నందున ముఖ్యమంత్రి మూడు రాజధానులు నిర్ణయాన్ని తీసుకున్నారని వివరించారు. దీని వల్ల సమగ్ర రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.

మీడియాతో వైవీ సుబ్బారెడ్డి

ABOUT THE AUTHOR

...view details