ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అవినీతి రహిత పాలన అందిస్తా' - jagan on babu

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైకాపా సమర శంఖారావం సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఫారం-7 అంటే రిక్వెస్ట్ ఫర్ వెరిఫికేషన్‌ మాత్రమేనని జగన్ తెలిపారు. తెదేపా చేర్చిన దొంగ ఓట్లను కొనసాగించాలని చూస్తున్నారని ఆరోపించారు.

'అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందిస్తా'

By

Published : Mar 11, 2019, 5:32 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైకాపా సమర శంఖారావం సభకు పార్టీ అధినేతవైఎస్ జగన్ హాజరయ్యారు. ఫారం-7 అంటే రిక్వస్ట్ ఫర్ వెరిఫికేషన్‌ మాత్రమేనని జగన్ తెలిపారు. తెదేపా చేర్చిన దొంగ ఓట్లను.. ఇంకా కొనసాగించాలని చూస్తున్నారని ఆరోపించారు. సేవామిత్ర యాప్‌తో అందరి వివరాలు దొంగిలించారని చెప్పారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి వ్యక్తికి ఓటేయాలో.. వద్దో.. ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు. వైకాపా శ్రేణులంతా తమకు ఓటు ఉందో లేదో చూసుకోవాలని చెప్పారు. ఓటరు కార్డు మీద ఉన్న నెంబరును 1950కు ఎస్‌ఎంఎస్‌ చేయాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details