ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కష్టాల్లో కేబుల్ ఆపరేటర్లు.. ప్రభుత్వమే ఆదుకోవాలి' - eastgodavari news

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో కేబుల్ ఆపరేటర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని... రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల ఐకాస ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.

JAC Meeting of State Cable Operators Associations
రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సంఘాల జెఏసీ సమావేశం

By

Published : Nov 5, 2020, 7:46 PM IST

కేబుల్ ఆపరేటర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని... ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల ఐకాస ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గౌరీ కల్యాణ మండపంలో రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సంఘాల ఐకాస సమావేశం నిర్వహించారు.

వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు సమస్యలపై చర్చించారు. కరోనా వేళలోనూ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సేవలు అందించామన్నారు. కోవిడ్​ సోకి మృతి చెందిన కేబుల్ ఆపరేటర్ల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details