ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా... రాష్ట్రంలో ఇంకా గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. నియోజకవర్గంలోని బాపూజీనగర్‌లో ప్రజాచైతన్య యాత్ర చేపట్టిన ఆయన... ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ ఫలాలను దూరం చేస్తూ అర్హుల పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగిస్తున్నారని ఆరోపించారు. 9 నెలలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోగా... కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
'అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా...అభివృద్ధి మాత్రం శూన్యం' - జగన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్
రాష్ట్రప్రభుత్వం 9 నెలలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోగా.. కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తోందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. నియోజకవర్గంలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టిన ఆయన... ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి