ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన ఉపాధ్యాయుడు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన పీవో - తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలో గిరిజన ఉపాధ్యాయుడు మల్లె మనసు అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రవీణ్ ఆదిత్య ఆవిష్కరించారు.

east godavari district
మల్లె మనలు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఐటీడీఏ

By

Published : Jul 14, 2020, 9:53 PM IST

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం బొడ్లంక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పల్లాల లచ్చిరెడ్డి... గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి విధానాలపై మల్లె మనసు పేరుతో పుస్తకాన్ని రచించారు.

ఆ పుస్తకాన్ని ఇన్ఛార్జి పీవో ప్రవీణ్ ఆదిత్య ఐటీడీఏ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఉపాధ్యాయుడు లచ్చిరెడ్డిని పీఓ అభినందించారు. రచయిత సోదరుడు పల్లాల రాజ్ కుమార్ రెడ్డి, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details