తూర్పుగోదావరి జిల్లా ఐటీడీఏ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో అట్రాసిటీ కేసులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి... సత్వరమే న్యాయం చేయాలని ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. డివిజన్ పరిధిలో నమోదైన కేసులపై ఆరా తీశారు.
'అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించండి' - rampa chodavaram latest news
ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదయ్యే అట్రాసిటీ కేసులను... అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదేశించారు. ఈ సందర్భంగా రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
అధికారులతో సమావేశమైన ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్