తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శీతల సమావేశ మందిరం, గ్రంథాలయం ప్రారంభ కార్యక్రమానికి... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హాజరయ్యారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం తప్పు కాదు గాని... అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా పెట్టాలని ఆయన కోరారు. ఎవరికి కావాల్సినంత ఇసుక వారికి సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతోందని... అయితే ధర ఎక్కువగా ఉందన్నారు. దీనిపై వస్తున్న విమర్శలు కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు: ఉండవల్లి - మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శీతల సమావేశ మందిరం, గ్రంథాలయం నిర్మాణ పనులను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రారంభించారు. ఇసుక, ఇంగ్లీష్ మీడియం అంశాలపై ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడం హక్కు అని పేర్కొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్