ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే కుమారుడి వివాహ విషయంలో వివాదాలు - illegal affairs of politicians in east goavari dst

తూర్పుగోదావరి జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి తన కుమారుడి వివాహం విషయంలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పలను ఇరికించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

issue in ez mla son in east godavari dst kakinada
issue in ez mla son in east godavari dst kakinada

By

Published : Jun 13, 2020, 10:54 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి కుమారుడి వివాహంలో వివాదాలు చెలరేగాయి. తన కుమారుడితో సహజీవనం చేస్తున్నానని మంజుప్రియ అనే మహిళ చెప్పటంతో మూడేళ్ల క్రితమే పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుని 60 లక్షలు ఇచ్చామని పిల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు.

ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తుంటే మంజుప్రియ అనవసరంగా అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పెళ్లికి వచ్చిన మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పలను తమ కుటుంబ వ్యవహారాలలో ఇరికించి రాజకీయం చేయొద్దని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details