సంక్రాంతి పండగ సందర్భంగా కోడిపందేలు నిర్వహించకుండా.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని పి.గన్నవరం ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. ఇది వరకు పందెం ఏర్పాటు చేసిన నిర్వాహకులు, బరి కోసం స్థలాలు ఇచ్చిన యజమానులకు ముందస్తు నోటీసులు జారీ చేశామన్నారు. గతేడాది మండలంలోని మానేపల్లి, వాడ్రేవుపల్లి, చాకలిపాలెం, డీఎస్ పాలెం, ఊడిముడి తదితర గ్రామాల్లో కోడి పందేలు, జూదాలు నిర్వహించారు. వాటిని నియంత్రించేందుకు ఈసారి.. పక్కాగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
కోడిపందేలు నిర్వహించకుండా ముందస్తు హెచ్చరికలు జారీ - p.gannavaram latest news
సంక్రాంతి పురస్కరించుకుని కోడిపందేలు, జూదాలు ఆడకూడదని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎస్సై తెలిపారు. పందేలు నిర్వహణకు స్థలాలు ఇచ్చే యజమానులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పోలీసులు