ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

14 కోట్లతో మురుగు కాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో పంట కాలువలు మురుగు కాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు వంటి నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులను 9 ప్యాకేజీలుగా విభజించినట్లు జల వనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ రామకృష్ణ తెలిపారు. 14 కోట్ల 30 లక్షల రూపాయలతో ఈ పనులు చేపట్టనున్నారు.

14 కోట్లతో మురుగు కాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులు
14 కోట్లతో మురుగు కాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులు

By

Published : Jun 20, 2021, 7:03 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో 14 కోట్ల 30 లక్షల రూపాయలతో పంట కాలువలు, మురుగుకాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులను చేపట్టనున్నారు. ఈ పనులను 9 ప్యాకేజీలుగా విభజించినట్లు జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ తెలిపారు. ఈ నెల 18న టెండర్లు పిలిచినట్లు ఆయన వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ నుంచి రబీ సీజన్ వరకు ఈ పనులు కొనసాగుతాయని రామకృష్ణ తెలిపారు. పంటకాలువలు, మురుగు కాలువల ప్రవాహానికి ఆటంకం లేకుండా గుర్రపు డెక్క ఇతర అనవసర మెుక్కలు తొలగించి శుభ్రం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details