వర్షాకాలం సమీపిస్తుండటంతో... పోలవరం ప్రాజెక్టు వద్ద చేపట్టాల్సిన అత్యవసర పనులపై అధికారులతో జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి.. వరద సీజన్‌లోగా అంసపూర్తిగా ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని గుత్తేదారులకు దిశానిర్దేశం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రోచ్ ఛానల్‌తో పాటు స్పిల్‌వే వద్ద చేపట్టాల్సిన పనులపై మంత్రి అనిల్ చర్చించారు.
అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలి: మంత్రి అనిల్ కుమార్ - polavaram project authority
పోలవరం ప్రాజెక్టు అధికారులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్