తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జలవనరుల శాఖ అధికారులు గోదావరి వరద ప్రణాళికపై సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదికి వరద అంచనా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితరాలకు సంబంధించి పటిష్ఠ చర్యలపై సమావేశంలో చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో వరద ముంపుపైనా సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను కలెక్టర్ మురళీధర్ రెడ్డికి సమర్పించనున్నారు. అనంతరం ఆయన సమక్షంలో మరోసారి భేటీ కానున్నారు.
ధవళేశ్వరంలో గోదావరి వరద ప్రణాళికపై సమావేశం - గోదావరి నది వరద ప్రణాళికపై జలవనరుల శాఖ అధికారుల సమావేశం
గోదావరి నదికి ఈ ఏడాది వచ్చే వరద అంచనా, దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం.. జలవనరుల శాఖ అధికారులు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సమావేశమయ్యారు. ఇందులో చర్చించిన అంశాలను కలెక్టరుకు సమర్పించి.. ఆయన సమక్షంలో మరోసారి భేటీ కానున్నారు.
![ధవళేశ్వరంలో గోదావరి వరద ప్రణాళికపై సమావేశం irrigation-department-officers-meeting-in-dhawaleswaram-east-godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7184440-673-7184440-1589375795250.jpg)
ధవళేశ్వరంలో గోదావరి వరద ప్రణాళికా సమావేశం