తూర్పుగోదావరి జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. కోనసీమలోని పి. గన్నవరం అమలాపురం తదితర ప్రాంతాలలో కుండపోతగా వర్షం పడింది. ఈ నెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పి. గన్నవరం పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ రేయింబవళ్లు అధికారుల పర్యవేక్షణలో వందలాది మంది సిబ్బంది పర్యటన ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. వర్షం కారణంగా పనులకు ఆటంకం ఏర్పడింది.
ఓ వైపు వర్షాలు..మరోవైపు సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు
తూర్పుగోదావరి జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఈ కారణంగా పి. గన్నవరంలో జరుగుతున్న సీఎం పర్యటనకు సంబంధించిన పనులకు విఘాతం కలిగింది. సభ నిర్వహించనున్న ప్రాంతంలో నీరు నిలిచిపోయింది. అయితే ఉదయం నుంచి వాతావరణం అనుకూలించడంతో పర్యటన ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.
పి. గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పలుచోట్ల నీరు నిలిచిపోయింది. ఈరోజు ఉదయం నుంచి వాతావరణం అనుకూలించడంతో తిరిగి పనులు కొనసాగుతున్నాయి. జడ్పీ ఉన్నత పాఠశాలలోని సభాస్థలి వద్ద వర్షపు నీరు నిలిచిపోయి చిత్తడిగా ఉంది. ప్రాంగణాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా శరవేగంగా ఉదయం నుంచి పనులు చేస్తున్నారు. సీఎం పర్యటనకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ రెండు రోజులు వాతావరణం పూర్తిగా అనుకూలించాల్సిన అవసరం ఉంది. అయితే ఎంత వర్షం వచ్చినా ముఖ్యమంత్రి పర్యటన ఉండి తీరుతుందని.. ఆ దిశగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి.
ఇదీ చదవండీ..NIRMALA SEETARAMAN: శుభకార్యంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్